24 C
Hyderabad
Sunday, August 2, 2026

కృపాల్ సింగ్ కు ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జియుపిఎస్ కంటేశ్వర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయిబాబా ఆధ్వర్యంలో పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ ఇటీవలే పదవి విరమణ పొందిన సందర్భంగా పాఠశాలలో ఘనంగా సన్మానం చేశారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కృపాల్ సింగ్ సేవలు అమూల్యమని, విద్యార్థులకు చదువుకై ప్రోత్సహించడంలో ముందుంటారని తెలిపారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ పేద పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వారు సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్లేనని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సరోజ, అర్జున్ సింగ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

A grand tribute to Kripal Singh

More articles

Latest article