- ఆపరేషన్ కగార్ అపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు
- ప్రజా సంఘాల రూపకల్పన చేసింది సిపిఐ పార్టీ
- సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీజేపీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది. దొంగలకు, దుర్మార్గులకు కొమ్ముకాసే ప్రభుత్వాన్ని అంత చేయాలంటే మనమంతా ఒకటి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణం మండపం మిని హాల్ లో సిపిఐ పార్టీ జిల్లా వ మహా సభ వై. ఓమయ్య, రాజేశ్వర్, రాజన్న ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతు.. మనదేశంలో అన్ని ఉన్నాయి. రత్నాల గర్భం మన దేశమని బడా బాబులకు దోచి పెట్టే వారిపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ప్రజల హక్కులను సాధించిన ఘనత సిపిఐ అనుబంధ సంఘాలు ఏఐటీయూసీ, రైతు సంఘాలు, మహిళ, విద్యార్థి సంఘాల వల్లనే అనేక చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు ఎరుపు అంటే మోడీ కి భయం అని సిపిఐ పార్టీ నల్ల చట్టాలపై చేసిన పోరాటాలతో వెనక్కి తగ్గారని, ఆపరేషన్ కగార్ అపకపోతే బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మార్క్సిజం సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడినదే సిపిఐ పార్టీ అన్నారు. ఆనాడు దేశంలో ఐదు వందల సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన త్యాగ ధనుల పార్టీ మనదే అన్నారు. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పోరాడిన ఏకైక పార్టీ అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి వేలాది మందిని కోల్పోవడం జరిగిందని అన్నారు. సిపిఐ నుంచి విడిపోయిన సిపిఐ ఎం, సిపిఐ ఎంఎల్, అయిన అందరి సిద్ధాంతం ఒకటే అన్నారు. యంత్రాలు లేని సమాజం రావాలని, కావాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. దోపిడి గురయ్యే వర్గానికి వెన్ను దన్నుగా నిలిచే వారం మనమే అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రజలకు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ముసుగులో బీజేపీ ప్రభుత్వం పేదలను, కార్మికులను మోసం చేస్తుందని అన్నారు. హక్కులను కాలరాస్తూన్న బీజేపీ పాలన ఎటువైపు వెళ్తుందని మండిపడ్డారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉన్నట్లు అనిపించినా పేదల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బనక చర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ కృష్ణ, గోదావరి జలాలు తీసుకెళ్లే ప్రయత్నం మానుకోవాలని అందుకు రాష్ట్రం కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలుపశ్య పద్మ మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, అర్ ఎస్ ఎస్ విధానాలు కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిస్తూ సిపిఐ పోరాడుతున్న పరిస్థితి ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని రాజ్యాంగం, ఆర్టికల్స్ ను ఏర్పాటు చేసుకుంటే బీజేపీ కేంద్రంలో ఎన్నో ఎత్తుగడలు పన్నుతున్నారని అన్నారు. బీజేపీ పాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు.2023-2024 సంవత్సరంలో పేదరికం తగ్గిందని, పోషకాహారాల స్థాయి పెరిగిందని, ప్రచారాలకు పూనుకున్నారని, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలన్నారు. ఇతర రంగాలలో ఉపాధి దొరకక, కార్మికులు వ్యవసాయ రంగం వైపు మల్లుతున్నారని, వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో ఉందని అన్నారు. వ్యవసాయ రంగం దేశంలో సంపదను సృష్టించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ మహా సభలో ఏ. విఠల్ గౌడ్, సాయిలు, స్వరూప రాణి, రఘురాం నాయక్, అంజలి, దేవేందర్, అనిల్, హనుమండ్లు, కవిత, భాగ్యలక్ష్మి, మంద వెంకటేశ్వర్లు, ముత్యాలు సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

