బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం అమ్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంకిత,శ్రీజ,ప్రజ్వ లు త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు సీటు సాధించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలేవర్ ప్రభాకర్ రూ 3వేలు,పిఏసిఎస్ సీఈవో రాజేశ్వర్ 4వేలు,విశ్రాంత ఉపాధ్యాయుడు ఖలీల్ 7 వేలు నగదు పురస్కారాన్ని అందజేశారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ యువకులు,గ్రామస్తులు సంయుక్తంగా విద్యార్థినిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరెడ్డి గంగాధర్, పల్లెన్న,ప్రభాకర్, రూమ్మాజీ, రాజు, సాయన్న, అశోక్, సాయి, వెంకటేష్, రాము, అస్రార్, సాయిలు, సంతు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
