. . . ఆటో కోసం స్నేహితుడి హత్య చేసిన పాత నేరస్తుడు
. . . ఇందల్వాయి అటవి ప్రాంత హత్య కేసును చేదించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఈ నెల 17న ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి అటవి ప్రాంతంలో వెలుగు చూసిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలో చేదించారు. నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి హత్య కేసును చేదించిన వివరాలను విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఎసిపి కథనం ప్రకారం… ఇందల్వాయి అటవి ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడి హత్య చేసి దహనం చేసిన వివరాలు స్థానికుల ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అది వరకు 15న తన భర్త కండేలా సందిప్ (28) కనిపించడం లేదని నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రహ్మణ కాలనీకి చెందిన కండేలా లత ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుకు అటవి ప్రాంతంలో హతుని వివరాలు పోలికలు ఉండటం తో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నాగారంకు 80 క్వార్టర్స్ కు చెందిన బైరగోని సతీష్ గౌడ్ ను బుధవారం మాదనగర్ వద్ధ అదుపులోకి తీసుకోవడం తో సందీప్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. బైరగోని సతీష్ గౌడ్ పాత నేరస్తుడు . అతనిపై 2020 నుంచి దొంగతనం కేసులు నాలుగు నమోదయ్యాయి. దానితో పాటు వనస్థలిపురంలో బంగారు నగల కోసం మహిళను హత్య చేసిన కేసు విచారణ ఉంది. సతీష్ గౌడ్ కు ఇదివరకే వివాహం జరిగిన భార్య భర్తల మధ్య విబేదాలతో అతని భార్య హైదరాబాద్ లో పుట్టింటిలో ఉంటుంది. ఎ పని చేయని సతీష్ గౌడ్ జల్సాల కోసం దోంగతనలు చేయడం అప్పుడప్పుడు నాగారం కు వస్తే పోతుండేవారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్ గా పనిచేసే సందీప్ తో సతీష్ గౌడ్ కు స్నేహం కుదిరింది. కానీ ఇటీవల కాలంలో సతీష్ గౌడ్ వద్ద డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. డబ్బులు సులువుగా సంపాదించాలని ప్రయత్నిస్తుండగా ఇటివల సందిప్ ఆటో కోనుక్కుని తింపుతున్నట్టు గుర్తించాడు. అతనివద్ధ ఉన్న ఆటోను దొంగలించి అమ్ముకోవాలని ప్లాన్ వేశాడు సతీష్ గౌడ్. ఈ నెల 15న ఉదయం వేళ సందిప్ ఆటోలో ఎక్కి నగరం తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో మద్యం , కల్లు సేవించారు. కామారెడ్డి వేలితే మంచి గిరాకీ దొరుకుతుందని సందీప్ ను నమ్మించి ఆటోలో సతీష్ గౌడ్ కామారెడ్డికి పయనమయ్యారు. అప్పటికే మద్యం, కల్లు విపరీతంగా సేవించడంతో సందీప్ మత్తులో జోగుతున్నాడు. ఇదే అదనుగా ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి అటవి ప్రాంతంలో ఉన్న కుంటవద్ధకు ఆటోను తీసుకువెళ్లారు. అక్కడ కాల్ల క్రుత్యాలు తీర్చుకునే నెపంతో కిందకు దిగిన సతీష్ అక్కడ అదను కోసం వేచి ఉన్నాడు. సందీప్ ఆటో దిగి కుంటవద్ధకు వెల్లగా అతడిని వెనుక నుండి తోసేసాడు. కిందపడిన సందీప్ పై బండరాయితో ఛాతీపై మోది హత్య చేశాడు. అక్కడే ఉన్న కట్టేలు, చేత్తతో సందీప్ డెడ్ బాడీ దహనం చేసి ఆటోను, సందీప్ మొబైల్ ను తీసుకుని హైదరాబాద్ కు పరారీ అయ్యారు. బుధవారం మాదనగర్ వద్ద దొరికిన సతీష్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే సందీప్ ను హత్య చేసినట్లు ఓప్పుకోగా అతడివద్ధనుంచి సందిప్ కు చెందిన ఆటో, సెల్ పోన్ స్వాధీనం చేసుకున్నారు. మిస్సింగ్, మర్డర్ కేసును 24 గంటల వ్యవధిలో చెందిన నార్త్ రూరల్ సిఐ, ఐదవ టౌన్ ఎస్ ఐలను సిబ్బందిని ఎసిపి రాజా వెంకట్ రెడ్డి అభినంధించారు.
