29 C
Hyderabad
Monday, August 3, 2026

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మైనర్ బాలికను వివాహం చేసుకుంటాను అని చెప్పి బాలికపై లైంగికంగా దాడి చేసిన ఓ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోపాల్ పేట్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లారెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article