- బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీద కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో డీసీపీ బస్వారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లా రాజకీయాలను నేరస్థుల మాదిరిగా నడుపుతున్నారన్నారు. కబ్జాలు, మొరం–ఇసుక దందాలు, లంచగొండి వ్యవహారాలు మాత్రమే కాదు… ఇప్పుడు బహిరంగంగా గుండాయిజం, రౌడీయిజం కూడా పెంచుతున్నారని ఆరోపించారు. పాల్ద గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భూపతి రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ “సన్నబియ్యం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం” అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న యువకులు – సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, కరెంట్ బిల్లు మేమే కడుతున్నాం అని నిజం చెప్పగానే ఎమ్మెల్యే భూపతి రెడ్డి మండిపడి, ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు… వారిని తరిమేయండి” అంటూ బహిరంగంగా రెచ్చగొట్టారని తెలిపారు. ఎమ్మెల్యే మాటతో కాంగ్రెస్ గుండాలు అక్కడే యువకులపై దాడికి చేశారాని చెప్పారు. బీజేపీ నాయకుల మీద రౌడీయిజం చేస్తే చూసి ఊరుకునే పరిస్థితి లేదన్నారు. భూపతి రెడ్డి హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. కబ్జాలు మొరం దందా చేస్తున్న నాయకులను వెంట వేసుకొని దాడులు చేయిస్తున్నారు అన్నారు. రూరల్ లో భూపతి రెడ్డి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేక పెరిగింది అన్నారు. అడగడగునా ఎమ్మెల్యేను అడ్డుకుంటే సహనం కోల్పోతున్నారు అన్నారు. ఇటువంటి దాడులకు బీజేపీ నాయకులు భయపడరని అన్నారు. జిల్లా పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఎత్తున బీజేపీ ధర్నాలు, ఆందోళనలు జరుగుతాయి అన్నారు. అడుగడుగునా భూపతి రెడ్డి ని అడ్డుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జగన్ రెడ్డి, కార్పొరేటర్ ప్రమోద్, శంకర్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి, ఆనంద్, ఆమందు విజయ్ కృష్ణ, జిల్లెల శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
