26.6 C
Hyderabad
Monday, August 3, 2026

త్యాగరాజ కీర్తనలతో మారు మోగిన రామ మందిరం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం శక్కర్ నగర్ శ్రీ కోదండ రామాలయం త్యాగరాజ కీర్తనలతో మారు మ్రోగింది. ఆదివారం ప్రతాప వంశస్తుల ఆధ్వర్యంలో ప్రతాప అన్నపూర్ణ, రామకృష్ణయ్యల జ్ఞాపకార్థం త్యాగరాజ కీర్తనల ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి శేష తల్ప సాయి, కందకుర్తి వాస్తవ్యులు యాదవరావు లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సంగీత విద్వాంసులు స్వప్న రాణి మరో వంద మందికి పైగా సంగీత విద్వాంసులు తమ గానంతో త్యాగరాజ కీర్తనలు ఆలాపించారు.

Rama Mandir resounded with Tyagaraja's hymns

ఈ ఉత్సవానికి హాజరైన సంగీత ప్రజలను త్యాగరాజ కీర్తనలు అత్యంత అద్భుతంగా అలరించాయి. త్యాగరాజ భక్తులు సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అనంతరం సంగీతం ఆలపించిన సంగీత విధ్వంసులకు ప్రతాప వంశస్థులు ప్రతాప గౌరీ శంకర శాస్త్రి, ప్రతాప శ్రీనివాస్ లు మెమొంటో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయిబాబా, ఉదయశ్రీ, దీప్తి శ్రీ, డాక్టర్ స్వప్న, రామానుజాచారి, బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ, రామాలయం ఆలయ కమిటీ శంకర్, లక్ష్మణ్ గుప్తా, రామరాజు, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.

Rama Mandir resounded with Tyagaraja's hymns

More articles

Latest article