బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం శక్కర్ నగర్ శ్రీ కోదండ రామాలయం త్యాగరాజ కీర్తనలతో మారు మ్రోగింది. ఆదివారం ప్రతాప వంశస్తుల ఆధ్వర్యంలో ప్రతాప అన్నపూర్ణ, రామకృష్ణయ్యల జ్ఞాపకార్థం త్యాగరాజ కీర్తనల ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి శేష తల్ప సాయి, కందకుర్తి వాస్తవ్యులు యాదవరావు లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సంగీత విద్వాంసులు స్వప్న రాణి మరో వంద మందికి పైగా సంగీత విద్వాంసులు తమ గానంతో త్యాగరాజ కీర్తనలు ఆలాపించారు.

ఈ ఉత్సవానికి హాజరైన సంగీత ప్రజలను త్యాగరాజ కీర్తనలు అత్యంత అద్భుతంగా అలరించాయి. త్యాగరాజ భక్తులు సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అనంతరం సంగీతం ఆలపించిన సంగీత విధ్వంసులకు ప్రతాప వంశస్థులు ప్రతాప గౌరీ శంకర శాస్త్రి, ప్రతాప శ్రీనివాస్ లు మెమొంటో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయిబాబా, ఉదయశ్రీ, దీప్తి శ్రీ, డాక్టర్ స్వప్న, రామానుజాచారి, బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ, రామాలయం ఆలయ కమిటీ శంకర్, లక్ష్మణ్ గుప్తా, రామరాజు, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.
