త్యాగరాజ కీర్తనలతో మారు మోగిన రామ మందిరం

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం శక్కర్ నగర్ శ్రీ కోదండ రామాలయం త్యాగరాజ కీర్తనలతో మారు మ్రోగింది. ఆదివారం ప్రతాప వంశస్తుల ఆధ్వర్యంలో ప్రతాప అన్నపూర్ణ, రామకృష్ణయ్యల జ్ఞాపకార్థం త్యాగరాజ కీర్తనల ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి శేష తల్ప సాయి, కందకుర్తి వాస్తవ్యులు యాదవరావు లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సంగీత విద్వాంసులు స్వప్న రాణి మరో వంద మందికి పైగా సంగీత విద్వాంసులు తమ గానంతో త్యాగరాజ కీర్తనలు ఆలాపించారు. ఈ ఉత్సవానికి...