24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అయోడిన్ లోప రుగ్మతల నివారణ పై అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గ్లోబల్ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రo సీతారాం నగర్ కాలనీ పరిధిలోని ఐటిఐ బాలికల కళాశాలలో  అయోడిన్ లోపా రుగ్మతలపై అవగాహన కల్పించినట్లు  జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గన్ పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోడిన్ లోపం ద్వారా థైరాయిడ్ గ్రంధి నుండి థైరాక్సిన్ హార్మోను విడుదల తగ్గడం ద్వారా అనేక అనర్ధాలు పిల్లలు, మహిళలు యువకులు వయో జనులలో వయసులవారీగా వివిధ రూపాల్లో కనిపించునని , ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి ,గ్రహణ శక్తి లోపించడం ,శారీరక మానసిక ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు. మెదడు ఎదుగుదల లేకపోవడంతో పిల్లలు మానసిక వైకల్యమునకు గురైతారని తెలిపారు. అదేవిధంగా మహిళల్లో తరచుగా గర్భవిచ్చితి జరగడం, పిండం ఎదుగుదల సరిగా లేక తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, మృత శిశువు జననం, అవయవ లోపాలతో జన్మించడం, గాయిటర్, గొంతులో వాపు,నీరసం, బలహీనత, హారుమోన్ల అసమతుల్యం, దంతాలు ఎముకలు బలహీన పడడం, ప్రత్యుత్పత్తి లోపాలు, వెంట్రుకలు రాలిపోవడం లాంటి అనేక అనర్ధాలు మహిళల్లో సంభవిస్తాయని తెలియజేశారు. అదేవిదంగా సీజనల్ వ్యాధులూ,పోషకాహారం,రక్తహీనత,వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లయ్య , ఏఎన్ఎం దివ్య,ఆశా కార్యకర్త , కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Awareness Conference on Prevention of Iodine Deficiency Disorders

More articles

Latest article