అయోడిన్ లోప రుగ్మతల నివారణ పై అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్లోబల్ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రo సీతారాం నగర్ కాలనీ పరిధిలోని ఐటిఐ బాలికల కళాశాలలో అయోడిన్ లోపా రుగ్మతలపై అవగాహన కల్పించినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గన్ పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోడిన్ లోపం ద్వారా థైరాయిడ్ గ్రంధి నుండి థైరాక్సిన్ హార్మోను విడుదల తగ్గడం ద్వారా అనేక అనర్ధాలు పిల్లలు, మహిళలు యువకులు వయో జనులలో వయసులవారీగా వివిధ...