23.4 C
Hyderabad

మున్సిపల్ వాహనాలు – బీమా లేకుండానే చక్కర్లు

Municipal vehicles – roaming around without insurance

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో  ప్రమాదం జరిగిన ట్రాక్టర్

 

. . .  రిజిస్ట్రేషన్లు లేని వాహనాలు ఇంకొన్ని

 

. . . దృష్టి సారించని ఆర్టిఏ

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

నగర పురపాలికలో ఉన్న శానిటేషన్ వాహనాలు బీమా లేకుండానే ధీమాగా తిరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రతి వాహనానికి భీమా చేయిస్తే… ప్రమాదం జరిగిన, వాహన మరమ్మతుల్లోనూ ఖర్చు భారం తగ్గుతుంది. చెత్త తీసుకొని డంపింగ్ యార్డ్ కు వెళ్లేందుకు రవాణా యోగ్యమైన వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. వీటిని పర్యవేక్షించే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వాహన స్థితిగతులు మారుతున్నాయి. నగరంలో చెత్త సేకరణ కోసం 13 మహేంద్ర ట్రాక్టర్లు, 20 హాలాండ్ ట్రాక్టర్లు, 7 ఐచర్లు, 43 టాటా ఇండ్ర, 24 టాటా ఏస్ లు తిరుగుతున్నాయి. మూడు కంపాక్టర్లు, మూడు స్వీపింగ్ మెషిన్లు, ఒకటి సక్కింగ్ మిషన్, ఒకటి జెట్టింగ్, ఒకటి సక్కింగ్, జెట్టింగ్ (రెండు కలిపిన) మెషిన్లు ఉండగా, వీటితో మురుగు కాలువలు, రోడ్లపై దుమ్ము శుభ్రం చేసేందుకు వాడుతున్నారు.

. . .  ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ట్రాక్టర్

నూతనంగా కొనుగోలు చేసిన  న్యూ హాలండ్ ట్రాక్టర్ కొన్ని నెలల్లోనే ప్రమాదానికి లోనైంది. రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో వదిలేశారు. దీని భాగాలను ఒక్కొక్కటిగా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. మున్సిపల్ శాఖలో ఉన్న వాహనాలకు బీమా లేకపోవడంతో పాటు కొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేకుండానే యదేచ్చగా నగరంలో తిప్పుతున్నారు. ఇందులో  కంపాక్టర్లు, స్వీపింగ్ మెషిన్లు, సక్కింగ్, జెట్టింగ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించకుండానే ఉంచినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వాటిలో కొన్ని ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ పేపర్లు లేవని సమాచారం.

. . .  దృష్టి సారించని ఆర్టిఏ

సామాన్యుల రవాణా వాహనాలు రోడ్డు ఎక్కితే బీమా లేదని, రోడ్ టాక్స్ కట్టలేదని ఆర్టిఏ అధికారులు చాలా చలానలు వేస్తుంటారు. మున్సిపల్ శాఖకు చెందిన శానిటేషన్ వాహనాలు నగరంలో తిరుగుతుంటే ఏ ఒక్కదానిని నిలిపి పత్రాలను పరిశీలించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా ఉండాల్సిన మున్సిపల్ శాఖ వాహనాలకు సంబంధించిన భీమా (ఇన్సూరెన్స్), పన్నులు కట్టకుండా ఉండడం ఎంతవరకు సమంజసమో అధికారులకే తెలియాలి.

More articles

Latest article