. . . ముగ్గురు పట్టివేత
. . . రూ.50,280 నగదు, ఐదు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనంః
బాన్సువాడ బతుకమ్మ :
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.50,280 నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం తాడ్కోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్లు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పేకాట ఆడితే చర్యలు తప్పవని సీఐ తుల శ్రీధర్ అన్నారు. పేకాట, జూదం చట్టరీత్యా నేరమని , ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
