నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈ నెల 25, 26 తేదీలలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సిఐటియు పిలుపునిచ్చిన మేరకు జిల్లా నుంచి అంగన్వాడీ, ఆశ, గ్రామపంచాయతీ, మధ్యాహ్న భోజనం , బీడీ, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున కదిలి హైదరాబాదులోని ఇందిరాపార్కు చేరుకున్నారు. ఈ ధర్నాలో ఆయా రంగాల కార్మికులు తో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర గౌడ్, ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు ,దేవగంగు, స్వర్ణ, చంద్రకళ, జంగం గంగాధర్ ,గణేష్, సుకన్య, స్వప్న తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని , లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తాను ఇచ్చిన హామీలను అమలు జరగని యెడల ఈ పోరాటాలను మరింత ఉదృతం చేస్తామన్నారు. లేనియెడల డిసెంబరు ఒకటి ,రెండు ,మూడు, తేదీలలో ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం తమ నిరసనను తెలియజేస్తామన్నారు. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
