నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
సేవాదళ్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సంధి బెన్సన్ రాజు సోమవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బెన్సన్ రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కి, రాష్ట్ర సేవాదళ్ ఇంచార్జ్ యూసఫ్ జాహీకి, అలాగే రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షులు జితేందర్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నా నియామకానికి ప్రత్యేక కృషిచేసిన బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ లకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
