25.1 C
Hyderabad

టపాస్ రాజుకుంటే.. బుగ్గే!

If a firecracker goes off... your cheek is done for!

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు

 

. . . జనవాసాలలో టపాసుల నిల్వలు

 

. . . చోద్యం చూస్తున్న అధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

దీపావళి పండుగ వచ్చేసింది. ఇప్పటినుంచే చిన్నారుల ఉత్సాహం మొదలైంది. టపాసులు కొనాలి, పేల్చాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో నిజామాబాద్ లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండానే టపా సుల విక్రయాలను జోరుగా చేపడుతున్నారు.

. . . రద్దీగా ఉండే గంజి ప్రాంతంలో టపాసుల దుకాణాలు
జనవాసాల మధ్య నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసారు. దీని కోసం టన్నుల కొద్ది దిగుమతి చేసుకుంటున్నారు. పేలుడు పదార్థాలతో తయారుచేసిన టపాసులను నగరం బయట విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా నడిబొడ్డున దుకాణాలు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో టపాసుల దుకాణాలకు అనుమతులు ఉండడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులను కాల్చాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు మామూలు గా తీసుకుంటుండడంతోనే ఈ అక్రమ దందా సాఫీగా సాగిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానిక దుకాణాదారులు, ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేయడం కంటే ముందస్తు చర్యలు తీసుకుంటేనే బాగుంటుందనే వ్యాఖ్యాలు వినబడుతున్నాయి. టన్నుల కొద్దీ దిగుమతి చేసుకొని విచ్చలవిడిగా టపాసుల విక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

If a firecracker goes off... your cheek is done for!

. . . జనవాసాల మధ్య టపాసుల నిలువలు
టపాసుల వ్యాపారులది ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతోంది. అధిక లాభాల కోసం ఆశించి… దీపావళి పండుగను పురస్కరించుకొని కొన్ని నెలల ముందే ఇతర రాష్ట్రాల నుంచి టపాసులను దిగుమతి చేసు కొని జనవాసాల మధ్య గుట్టుచప్పుడు గాకుండా నిలువలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే అంతే సంగతులు…

More articles

Latest article