నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ని, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ని, రాష్ట్ర కోశాధికారిని ఉమాదేవిని టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో జంబి ఆకు (బంగారం) అందజేసి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. రాష్ట్ర చైర్మన్ ను కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, వీరితో పాటు టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
