నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పండగ సాయన్న జయంతి ఘనంగా నిర్వహించారు. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కెంపు నాగరాజు,రాష్ట్ర నాయకులు పోతంకల్ లక్ష్మీనారాయణ, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ,యూత్ విభాగం అధ్యక్షులు పెంచల మహేష్, ముదిరాజ్ నాయకులు బీసీ నాయకులు పాల్గొన్నారు.
