. . . భర్తతో కలిసి ఘాతుకానికి పాల్పడిన పనిమినిషి
. . . కామారెడ్డి మర్డర్ కేసును చేదించిన పోలీసులు
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి పట్టణంలో సెప్టెంబర్ 29న జరిగిన వృద్దురాలి హత్య కేసును చెదించినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… ఇంట్లో పనిచేసే పనిమనిషి తన భర్తతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని, వృద్దురాలి ఓంటి మీద ఉన్న బంగారు నగల కోసమే ఈ హత్య చేశారని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముష్రిబ్ బాగ్ చెందిన వృద్ధురాలైన అనసూయ (66) భర్తతో కలిసి నివసిస్తుంది. వారి ఇంటిలో బతుకమ్మ కుంట కు చెందిన బోసు రజిత పనిమనిషి గా పనిచేస్తుంది. అనసూయ ఒంటి మీద ఉన్న బంగారు నగలను దొంగిలించాలి అని పక్కా పథకం ప్రకారం అనసూయ భర్త గుడికి వెళ్లిన సమయంలో హత్య చేశారని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం భర్త నర్సింగ్ ను రప్పించిన రజీత కరెంట్ లేని సమయంలో అనసూయను తువ్వాలుతో గొంతుకి ఉరి బిగించి హత్య చేశారు. ఆమె ఒంటి మీద ఉన్న 8 తులాల బంగారు నగలు తీసుకుని పరారీ అయ్యారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అనసూయ భర్త ఇంట్లో విగత జీవిగా భార్య అనసూయ పడి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కామారెడ్డి డిఎస్పీ మధు సూదన్, పట్టణ సిఐ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలు, సాంకేతిక సమాచారం విచారణ చేపట్టారు. సోమవారం గంజ్ పాఠశాల ప్రాంతంలో రజితను అదుపులోకి తీసుకుని విచారించడంతో అనసూయ ను నగల కోసం భర్తతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. 2023 లోను బోసు నర్సింగ్, రజీతలు ఈదే తరహలో దోపిడికి పాల్పడ్డారని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. విచారణ అనాటి కేసు కూడా ఒప్పుకున్నారని, అనసూయ హత్య కేసును చేదించిన 8 తులాల బంగారం రికవరి చేసి, ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు చేధనలో తీవ్రంగా శ్రమించి న పట్టణ సీఐ నరహరి, ఎస్సై రంగారావు, కానిస్టేబుల్ రామా స్వామీ, రాజు నాయక్, సంపత్ లను ఎస్పీ అభినందించారు.

