కరీంనగర్, బతుకమ్మ :
ఓ చోరి కేసులో అరెస్టు అయిన నిందితుడు పోలీసులకు భయపడి పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో కరెంటు వైర్ల చోరీ కేసులో విచారణకు హాజరైన నిందితుడు మొదటి అంతస్తు నుంచి దూకాడు. విచారణలో పోలీసులకు భయపడి దూకినట్లు నిందితుడు అజయ్ తెలిపారు. అయితే గత రోజులుగా పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేరం ఒప్పుకున్నా టార్చర్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. విచారణలో వివరాలు సేకరిస్తుండగా అజయ్ మొదటి అంతస్తు నుంచి దూకాడని ఏసీపీ వివరణ ఇచ్చారు. వారం రోజుల క్రితమే అవినీతి ఆరోపణలపై ఎల్‌ఎండీ సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్ అయ్యారు.
