25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆయుదాల వాడకంపై  ఓపెన్ హౌజ్

Must read

📰 Generate e-Paper Clip

ప్లాగ్ డే సంధర్బంగా విద్యార్ధులకు ఆయుదాల వినియోగంపై అవగాహన

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవముల సందర్భంగా పోలిస్ శాఖ విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమం  నిర్వహించింది.  ప్లాగ్ డే ను పురస్కరించుకోని పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) కోటేశ్వర రావు, విద్యార్థినీలతో కలిసి ఓపేన్ హౌజ్ ను ప్రారంబించారు.

 

Open House on Use of Arms ఓపెన్ హౌజ్ కార్యాక్రమంలో కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ , ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిశిత డిగ్రీ మహిళా కాలేజీ విద్యార్థులకు 303 రైఫిల్, ఎస్. ఎల్. ఆర్. ఇన్సాస్, ఎ.కె. 47, 9 ఎమ్. ఎమ్ కార్బన్, గ్యాస్ గన్, యాంటి రైడ్ గన్, పిస్టల్, రివాల్వర్, గ్రెనేటు, ఎల్.ఎమ్.జి  లాంటి ఆయుదాల వాడకంపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

Open House on Use of Arms

నేర పరిశొధనలో  పొలిసులు వినియోగించే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కమ్యూనికేషన్స్ విభాగాల గూరించి విద్యార్ధులకు వివరించారు. ఈ ఓపెన్ హౌజ్ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, ఫారెన్సీక్ హెచ్.ఓ.డి డా॥ నాగమోహన్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్స్  సతీష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి, శేఖర్, ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్  ప్రసాద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా  లు పాల్గోన్నారు.

 

 

More articles

Latest article