నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగర్ లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి, కొడుకులు షాజ్ ఖాన్,ఫజల్ ఖాన్ లు మృతి చెందారు. గత నెల 28న ఉదయం ఇంట్లో మంటలు చెలారేగడంతో ఇళ్లంతా దట్టమైన పోగలు కమ్ముకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.

ఈ ఘటనలో తండ్రి, కొడుకులకు తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు శుక్రవారం ఉదయం మృతి చెందారు.

