25.6 C
Hyderabad

కాకతీయ ఓంలపీయాడ్ స్కూల్ లో దసరా వేడుకలు

Dasara celebrations at Kakatiya Olympiad School

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఘనంగా బతుకమ్మ సంబరాలు

 ఇందూర్, బతుకమ్మ:

 నగరంలోని కాకతీయ ఓలంపీయాడ్ స్కూల్స్ ( కేఓఎస్ విద్యాసంస్థల్లో) బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు ముందస్థుగా నిర్వహించారు.  శుక్రవారం ఉపాధ్యాయులు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగం అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు సంయుక్తంగా శ్రమించి వినూత్న దుర్గాదేవి విగ్రహాలను రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధానంగా 7 ఫీట్ల ఎత్తు కలిగి, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ప్రతిబింబించే దుర్గాదేవి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో నవదుర్గమాతలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాదేవి పరాశక్తి స్వరూపం. ముఖ్యంగా స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తూ, భక్తులలో ఆత్మవిశ్వాసం, ధృడ సంకల్పాన్ని పెంపొందిస్తుంది. నవరాత్రులలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, సరస్వతి, లక్ష్మి, మహిషాసుర మర్దిని వంటి వివిధ రూపాలలో ఆరాధిస్తారు. ఈ విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది అవతారాలలో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకల్లో ఐ 20 అధ్యాపకులు విద్యార్థులు తయారు చేసిన రోబోటిక్ దుర్గమాత ఎంతో ఆకట్టుకుంది. అభివృద్ది చెందుతున్న టెక్నాలజీ ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రతిమ విద్యార్థుల భక్తికి, తెలివికి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాలను కూడా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని అడి, పాడారు.

Dasara celebrations at Kakatiya Olympiad School

. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్  రజనీకాంత్ మాట్లాడుతూ…”చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ సంవత్సరం ఈ వేడుకలు జరుపుకుంటాము. విద్యార్థులు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడవాలి. అధ్యాపకులు వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ, తద్వారా భావి భారత పౌరులై దేశానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని” విద్యార్థులకు తెలియజేశారు. అలాగే విద్యార్థుల్లో విద్యాబుద్ధులతో పాటు దేశభక్తి, రాష్ట్రాభిమానం మరియు సంస్కృతీ సాంప్రదాయాలపై అవగాహన పెంచేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు రాజా, తేజస్విని, రామోజీరావు, కాకతీయ విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ముందస్తుగా దసరా-బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Dasara celebrations at Kakatiya Olympiad School

ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల ఛైర్మన్ సి.హెచ్.  విజయలక్ష్మి జిల్లా విద్యార్థినీ, విద్యార్థులకు, జిల్లా అధ్యాపకులకు, జిల్లా తల్లిదండ్రులకు, జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, అన్నీ విజయాలు దక్కాలని ఆశిస్తూ ముందస్తు పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో ప్రిన్సిపాళ్లు రణదీశ్, సందీప్, గిరిధర్, చంద్రశేఖర్, భావన, ఫణీందర్, రాజ్ కిరణ్, విపిన్, నటరాజ్, సంతోష్, సుచరిత, రాఘవేంద్ర  ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Dasara celebrations at Kakatiya Olympiad School

 

More articles

Latest article