28.6 C
Hyderabad

కిడ్నాప్ చేసిన బాలికను దాచిపెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష

Man who hid kidnapped girl sentenced to seven years in prison

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : 

 

కిడ్నాప్ చేసిన బాలికను దాచిపెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర కు చెందిన గైక్వాడ్ బాలాజీ,సూర్యకాంత్ అన్నదమ్ములు. బతుకు తెరువుకోసం మద్నూర్ మండలం సలాబాత్ పూర్ గ్రామానికి వచ్చి అక్కడ ప్రభుత్వ పాడుపడిన వెటర్నరీ ఆసుపత్రినే ఇల్లుగా మార్చుకుని జీవించేవారు.కూలీ పనితో వచ్చే డబ్బులు బతకడానికి సరిపోతలేవని బావించిన బాలాజీ చిన్న పిల్లలు ఎవరినైనా అపంహరించి అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చనే దురాలోచనను తమ్ముడైన సూర్యకాంత్ కు తెలిపాడు. దీంతో ఇద్దరు కలిసి నిజామాబాద్ నగరానికి వచ్చారు.గాంధారి మండలం ముదాలె నర్సాపూర్ గ్రామానికి చెందిన వీరం శిరీష తన ఇద్దరు కుమార్తెలతో, ఒక కుమారిడితో వృద్దురాలైన తన తల్లితో కలిసి వచ్చి నాగారంలో స్థిరపడి నగరంలోని  రహదారుల వెంట, దుకాణాలలో పైసలు అడుక్కుని బతుకు వెళ్ళదీసుకునేది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 6 న రాత్రి సమయంలో నాగారం నుండి తన పిల్లలతో, తల్లితో కలిసి నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ కు చేరుకుని గాంధీ విగ్రహం దగ్గర తన తల్లితో పాటు మూడేళ్ల కూతురు ఉంచి బిక్షం అడుక్కోవడానికి వెళ్ళింది. రాత్రంత తన కుమారిడితో అక్కడక్కడ అడుక్కుని తిరిగి గాంధీ చౌక్ కు చేరుకుంది. అక్కడ నిద్రపోతున్న తన తల్లిని లేపి మూడేళ్ల కూతురు కనబడుటలేదని అడగడంతో నిద్ర ఉండడంతో తెలియకపోవడంతో శిరీష నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నివేదిక తయారు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఇతర ఆధారాలు సేకరించి బాలికను కిడ్నాప్ చేసింది గైక్వాడ్ సోదరులుగా గుర్తించారు. నేర విచారణలో భాగంగా పలు పోలీసు బృందాలు గాలించి గైక్వాడ్ సూర్యాకాంత్ ను అరెస్ట్ చేసి అతని నేర ఒప్పుకోలు పంచానామా నిర్వహించారు. బాలికను తాను కిడ్నాప్ చేయలేదని తన అన్న బాలాజీ కిడ్నాప్ చేసి సలాబాత్ పూర్ గ్రామానికి తీసుకువచ్చి తనకు అప్పగించాడని బాలికను అమ్ముదామని ప్రయత్నించేలోగ పోలీసులు వచ్చి పట్టుకున్నారని తెలిపాడు. నేర విచారణ పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.నేర న్యాయ విచారణ నిర్వహించిన జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ సాక్ష్యాల వాంగ్మూలాల నమోదు చేసిన అనంతరం రెండవ ముద్దాయి అయిన గైక్వాడ్ సూర్యాకాంత్ పై కిడ్నాప్ అయిన బాలికను దాచిపెట్టి ప్రధాన ముద్దాయి గైక్వాడ్ బాలాజీకి సహకరించినందుకు గాను ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష  విధించారు.

More articles

Latest article