కిడ్నాప్ చేసిన బాలికను దాచిపెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : కిడ్నాప్ చేసిన బాలికను దాచిపెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర కు చెందిన గైక్వాడ్ బాలాజీ,సూర్యకాంత్ అన్నదమ్ములు. బతుకు తెరువుకోసం మద్నూర్ మండలం సలాబాత్ పూర్ గ్రామానికి వచ్చి అక్కడ ప్రభుత్వ పాడుపడిన వెటర్నరీ ఆసుపత్రినే ఇల్లుగా మార్చుకుని జీవించేవారు.కూలీ పనితో వచ్చే డబ్బులు బతకడానికి సరిపోతలేవని బావించిన బాలాజీ చిన్న పిల్లలు ఎవరినైనా అపంహరించి అమ్ముకుంటే...