28.2 C
Hyderabad

ఓమన్ బహిష్కరించిన . . . దుబాయ్ ఎలా తీసుకుంది

How Dubai received the person expelled by Oman

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఇజ్రాయిల్ విమానం కూల్చివేత కు యత్నించిన కో పైలట్ పై నిషేధమా

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

దుబాయ్ ఇజ్రాయిల్ విమానాన్ని కూల్చివేయాలన్న ప్రయత్నంలో భారతీయ పైలెట్ మచ్చర్ పై హత్యాయత్నం చేసి అతడిని తీవ్రంగా గాయపరిచిన కో పైలెట్ ను ఆ దేశం ఇదివరకే విమానాలను నడపడం నిషేధించింది. ఈ మేరకు ఒక కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. అమెరికాలోని ఉన్నత స్థాయి వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియాలో ఈ కథనం వెలువడింది. ఓమన్ దేశం అతడిని విమానాలు నడపడాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర దేశాలతో ఎందుకు పంచుకోలేదో అర్థం కావడం లేదని కూడా పేర్కొంది. అతడికి ఉన్న రాడికల్ భావాలు, నరనరాన జీర్ణించుకున్న ఇస్లామిక్ తీవ్రవాద సిద్ధాంతాలు తో అతడిని విమానాలను నడపడం నుంచి బహిష్కరించిందని తెలిసింది. అలాంటి వ్యక్తిని  ఫ్లై దుబాయ్ సంస్థ ఎలా రిక్రూట్ చేసుకుందని,  అది కూడా అత్యంత సున్నితమైన ఇజ్రాయిల్ కు పోయే విమానాల్లో అతడిని కో పైలట్ గా ఎందుకు పెట్టిందో , దీని వెనక ఎవరున్నారో దర్యాప్తు చేయాలని కోరింది.  మొట్టమొదటిసారిగా వాల్ స్టేట్ జర్నల్లో కో పైలట్ పేరు ప్రచురించింది. అతడి పేరు హమామ్ అల్ హమామి అని ఆ పత్రిక కథనంలో పేర్కొంది . ఇదిలా ఉండగా ఇంతవరకు విమానం కూల్చివేతకు ప్రయత్నం జరిగి నాలుగు రోజులైనప్పటికీ ఇప్పుడే అతడి పేరు బయటకు వచ్చింది. ఇది పలు దేశాలకు సంబంధించిన సున్నితమైన సమస్య కాబట్టి ఆ పైలట్ వివరాలు బయటకు రానీయకుండా రహస్యంగా విచారిస్తున్నారు.

More articles

Latest article