. . . జండా ఊపి ప్రారంభించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్, బతుకమ్మ :
దేశంలో నిజామాబాద్ నుంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం పార్లమెంట్ సభ్యునిగా అమితా నందాన్నిచ్చిందని అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం ఇందూరు బైపాస్ రోడ్డు లో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఖేలో ఇండియా పోటీలకు నిజామాబాద్ నుండి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి దేశ, అంతర్జాతీయ క్రీడా పోటిల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎన్నో పథకాలను సాధించారు అని గుర్తు చేశారు. క్రీడలను, క్రీడాకారులను కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, పోటీ దారులు ఓలంపిక్ పోటీలకు ఎదుగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా సైక్లింగ్ క్రీడాకారులతో సెల్ఫీ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ , మేయర్ ఉమారాణి , రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి , భూలోకం విజయ కాంత్ రావు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి , జిల్లా ఒలంపిక్ సంఘం మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి , బొబ్బిలి నర్సయ్య , సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి , ఎస్ ఆర్ విద్యాసంస్థల డీజీఏమ్ గోవర్ధన్ రెడ్డి , నగర కార్పొరేటర్లు, 33 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
