24.2 C
Hyderabad

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళ్ళు

Grand tribute paid to Chakali Ailamma under the aegis of the BC Welfare Association.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి, తెలంగాణ ధీర వనిత, కేవలం మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద  మహనీయుల పార్కులో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనమని, దున్నేవాడిదే భూమి అనే నినాదంకు జన్మనిచ్చిన తల్లి ఐలమ్మ అని,  ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించుకోవాలని బిసి సంక్షేమ సంఘం పిలుపునిచ్చిందన్నారు. ఆ రోజు దేశ్ముఖ్ లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని బీసీ అన్నారు. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయం, తన నాలుగెకరాల భూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమిని చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ అన్నారు.  ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించిందని, ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపె రవిందర్, అపర్ణ, కొట్టూర్ చంద్రకాంత్, సాయి బసవ, బాలయ్య, శ్రీనివాస్, గంగాధర్, సురేందర్, అనిల్ సత్యనారాయణ, అంకంరావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article