30.2 C
Hyderabad

డీజేలకు చెక్

Crackdown on DJs

Must read

📰 Generate e-Paper Clip

 

డప్పుల దరువు . . . బాజా భజంత్రిలు

. . . ప్రశాంతంగా కామారెడ్డి గణేష్ నిమజ్జనం

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా కేంద్రం లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, డప్పుల దరువులు, డోలు బ్యాండ్లు, సంప్రదాయ నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. డీజేల శబ్దాలకు శబ్ద కాలుష్యం తో పాటు, ప్రాణాలు పోతుండటం తో వాటిని నిమజ్జన శోభయాత్ర లో నిషేధం విధించారు. కామారెడ్డి పట్టణం లో బుధవారం రాత్రి ప్రారంభమైన గణేష్ శోభ యాత్ర సాంప్రదాయబద్ధంగా డప్పు చప్పుళ్లు, డోలు బాజాలతో నిర్వహించడం విశేషం. సంప్రదాయ నృత్యాలు, బాజా భజంత్రీలతో శోభాయాత్రకు సరికొత్త కళ వచ్చింది. కేరళ బజాల వినియోగం కనిపించడం తో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమాయ్యాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు కుటుంబ సమేతంగా ప్రజలు పెద్ద ఎత్తున శోభాయాత్రను తిలకించేందుకు రోడ్డుపైకి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను వీక్షించే అవకాశం లభించిందని పలువురు పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు.

Crackdown on DJs

క్షేత్రస్థాయిలో ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షణ భద్రత నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తూ, కాలినడకన నిమజ్జన రూట్‌లో పర్యటించారు. భక్తులకు, మండపాల నిర్వాహకులకు, పోలీసు సిబ్బందికి ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “ప్రజల భద్రత, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించడం అభినందనీయం. శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన ప్రజలు రోడ్లపై గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి” అని సూచించారు. గణేష్ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద భద్రత ఏర్పాట్లు చేసారు. భారీ విగ్రహాలు గోదావరి కి తరలించారు.

Crackdown on DJs
Crackdown on DJs

More articles

Latest article