28.2 C
Hyderabad

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Setback for Danam Nagender in the Supreme Court.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు

 

. . . ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం

 

 వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు విధించిన అనర్హతపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ప్రకటించిన అనర్హత తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దానం నాగేందర్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. అనర్హత పడిందని, మళ్లీ ఎన్నికలకు వెళ్లండని సుప్రీంకోర్టు దానం నాగేందర్ కు స్పష్టం చేసింది. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంధర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 సికింద్రాబాద్ లోక్ సభ  స్థానం నుంచి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న దానం నాగేంధర్పై 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వేటు అమల్లోకి వచ్చిందని, ఖైరతాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తనకు ఉపశమనం అందించాలని దానం నాగేంధర్ సుప్రీంకోర్టును కోరారు. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ నెల 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం నాగేంధర్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఒకేపార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడమంటే తన సభ్యత్వాన్ని వదులుకోవడమేనని వ్యాఖ్యానించింది.

More articles

Latest article