27.2 C
Hyderabad

 బోధన్ పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

CP inspects Ganesh immersion arrangements at Pasupu Vagu in Bodhan.

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పసుపు వాగు వద్ద  బందోబస్తు ఏర్పాట్లను పోలీసు కమిషనర్ సాయిచైతన్య పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.  నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించి , విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు , సిబ్బందికి సీపీ పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని , భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా చర్యలు , నిమజ్జన ప్రదేశంలో జనసందోహం నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి , శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని పోలీస్ కమిషనర్ కోరారు. సీపీ వెంట బోధన్ ఎసిపి శ్రీనివాస్ , బోధన్ ఎస్. హెచ్. ఓ వెంకట్ నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article