. . . చెల్లిని కాపాడబోయి అన్న
మాక్లూర్, బతుకమ్మ :
ఏమి జరిగిందో తెలియదు.. చెల్లి వాగులో దూకడం తో కాపాడేందుకు యత్నించిన అన్న నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. మాక్లూర్ మండలం చిక్లీ – నవీపేట్ మండలం జన్నాపల్లి మధ్యలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది…స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలో జన్నాపల్లి కి చెందిన అన్న, చెల్లి వాగులో దూకి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం . . .నవీపెట్ మండలంలో ని జన్నె పల్లి గ్రామానికి చెందిన చెందిన గణేష్ ( 26)అతని సోదరి లయ (22 )ఇద్దరూ బుదవారం సాయంత్రం సమీపంలోని పెద్ద వాగు లోకి చెల్లి పెద్దవాగులోకి వెళ్తుంది అన్న సమాచారంతో అన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు అంతలోపే చెల్లి వాగులో దూకింది చెల్లిని కాపాడబోయి అన్న కూడా అదే వాగులో పడిపోయినట్టు స్థానికులు తెలిపారు..

వీరిద్దరూ నీటిలో మునిగిపోతుండటం గమనించిన స్థానికులు వారి దగ్గరలో ఉన్న వారికి సమాచారాన్ని అందించారు కానీ వారిద్దరు అప్పటికే నీటిలో మునిగిపోయి ఫలితం లేకుండా పోయింది. వారిద్దరు చనిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వివరాలు తెలియాల్సి ఉంది. అన్న మృతదేహం ను వెలికి తీశారు. చెల్లి డెడ్ బాడీ కోసం గాలీస్తున్నారు.. గణేష్ హైదరాబాద్ లో జాబ్ చేస్తుండగా లయ చదువు తున్నట్టు తెలిసింది.

