Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 9:25 pm Posted by : ramakrishna

చెల్లిని కాపాడబోయి అన్న

 

. .  . చిక్లీ పెద్ద వాగులో అన్న గల్లంతు

. . . చెల్లి సురక్షితం

మాక్లూర్, బతుకమ్మ :

క్షణికావేశంలో చెల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వాగులో కి దూకెందుకు వెళ్లిందని తెలిసిన అన్న ఆమెను కాపాడేందుకు యత్నించి నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో అన్న మృతి చెందగా చనిపోయింద నుకున్న చెల్లి సురక్షితంగా బయట పడింది. మాక్లూర్ మండలం చిక్లీ – నవీపేట్ మండలం జన్నాపల్లి మధ్యలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలో నవీపేట్ మండలంలో ని జన్నె పల్లి గ్రామానికి చెందిన చెందిన అల్లే గణేష్ ( 26)అతని సోదరి లయ ల కుటుంబం లో గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం సమీపంలోని చిక్లీ పెద్ద వాగు లోకి చెల్లి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంది అనే సమాచారంతో అన్న పరిగెత్తుకుంటూ వెళ్ళాడు .అంతలోపే చెల్లి వాగు వద్ద కనిపించకుండా పోయింది. చెల్లి వాగులో దూకిందని భావించిన గణేష్, చెల్లి ని కాపాడేందుకు వాగులో దుకారు. గణేష్ కు ఈత రాకపోవడం తో అతని బాబాయ్ తో పాటు మరి కొందరు అతన్ని పైకి లాగేందుకు యత్నించి విఫలం అయ్యారు. గణేష్ నీట మునిగి గల్లంతు అయ్యారు.ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. మాక్లూర్ పోలీస్ లు పెద్ద వాగు వద్దకు చేరుకొని గజ ఈతగాళ్ళ చేత గాలించగా గణేష్ మృతదేహం దొరికింది.

Brother and sister go missing in Chikli Pedda Vagu.

చెల్లి కూడా గల్లంతు అయిందని ఫిర్యాదు మేరకు రాత్రి వరకు గాలించిన ఫలితం లేకుండా పోయింది. చీకటి పడిందని గురువారం ఉదయం లయ కోసం వాగులో గాలించాలని పోలీస్ లు, గజా ఈతగాళ్ళు వెనుదిరిగారు. గురువారం తెల్లవారుజామున లయ ను గ్రామస్తులు గుర్తించి షాక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లయ సైతం ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండటం తో అసలు కారణాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాగులో ఇద్దరు గల్లంతు అయ్యారు అని కేసు నమోదు చేసిన పోలీస్ లు ఒకరు సురక్షితంగా బయట పడటం తో అకోణం లో విచారణ జరుపనున్నారు. 

Brother and sister go missing in Chikli Pedda Vagu.