23.7 C
Hyderabad

మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్ చార్జీల నియామకం

Appointment of Telangana Rakshana Sena in-charges for another 18 Assembly constituencies

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జీ సహా పలు జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక

. . . పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర పదవుల నియామకం

. . . వినాయక చవితి సందర్భంగా పార్టీలో పలు నియామకాలు ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత  

హైదరాబాద్, బతుకమ్మ :

రాష్ట్రంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇన్ చార్జీలను ప్రకటించారు. మెదక్ లోక్ సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం నూతన నియామకాలు ప్రకటించారు. ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించిన కవిత తాజా నియామకాలతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను నియమించారు. గతంలో మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలు,జిల్లా అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు పెద్దపీట వేశారు. ఆదిలాబాద్ గోపు వేణుగోపాల్ యాదవ్ (బీసీ), మహబూబ్ నగర్  దొడ్ల సౌజన్య రెడ్డి (ఓసీ), సికింద్రాబాద్ కంటోన్మెంట్ చింతల రాజలింగం (ఎస్సీ), కుత్బుల్లాపూర్ ఎత్తరి మారయ్య (బీసీ), ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి (ఓసీ), నిజామాబాద్ అర్బన్ కందాడి మోహికా రెడ్డి (ఓసీ), నిజామాబాద్ రూరల్ బానోత్ నరేశ్ నాయక్ (ఎస్టీ), నిర్మల్ డాక్టర్ మాల్వె చంద్ర ప్రకాశ్ (బీసీ), ఖానాపూర్ మేస్రం దయాకర్ (ఎస్టీ గోండు),  అంబర్ పేట్ కంచగిరి ప్రవీణ్ కుమార్ (బీసీ), ఖైరతాబాద్ దేవరి చంద్రశేఖర్ (బీసీ), జూబ్లీ హిల్స్ హలీమా బేగమ్ (ముస్లిం),  హుజూరాబాద్ కోకట్ల సంతోష్ యాదవ్ (బీసీ), పటాన్ చెరు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి (ఓసీ), దేవరకొండ నేనావత్ శివ నాయక్ (ఎస్టీ), నాంపల్లి సయ్యద్ మతీన్ అహ్మద్ (ముస్లిం), ఇల్లెందు  వాసం రామకృష్ణ దొర (ఎస్టీ కోయ), అశ్వారావుపేట సోడెం వెంకట్ (ఎస్టీ కోయ)లను నియమించారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జీగా మద్ది శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)నియమించారు. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులుగా  రంగారెడ్డి పురం మహేందర్ రెడ్డి (ఓసీ), సంగారెడ్డి మాసన్నగారి బాలయ్య (ఎస్సీ), ఆదిలాబాద్ బాపురావు రాథోడ్ (ఎస్టీ), నిర్మల్ లోకిని రాము (ఎస్టీ), కొమ్రం భీం ఆసిఫాబాద్ కిరిమిల వినోద్ చారి (బీసీ), మంచిర్యాల ఊదరి చంద్రమోహన్ గౌడ్ (బీసీ), మేడ్చల్ మల్కాజిగిరి నవీన్ గోగికర్ (బీసీ), మహబూబ్ నగర్ డాక్టర్ ఎర్రంశెట్టి వెంకట్రామ్ మూర్తి (బీసీ),  నిజామాబాద్ మంథెన నవీన్ రెడ్డి (ఓసీ), కరీంనగర్ గుంజపడుగు హరిప్రసాద్ (బీసీ), భద్రాద్రి కొత్తగూడెం సముద్రాల క్రాంతి కుమార్ (బీసీ), గ్రేటర్ హైదరాబాద్ (సైబరాబాద్,మల్కాజిగిరి కార్పొరేషన్ లు సహా) వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ (ఓసీ)లను నియమించారు.జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నిజామాబాద్ దొంత ప్రవీణ్ (ఎస్సీ), మేడ్చల్ మల్కాజిగిరి శీలం వీరేందర్ (ఎస్సీ),మంచిర్యాల తంగళ్లపల్లి అరుణ్ కుమార్ (బీసీ)లు నియమితులయ్యారు. టీఆర్ఎస్ అనుబంధ విభాగాల నుంచి ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కుమ్మరి శివశంకర్, ప్రధాన కార్యదర్శి హకీంకారి సురేందర్ జీలు నియమితులయ్యారు.తెలంగాణ న్యాయ రక్షణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పాల నరేందర్ యాదవ్, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా విజయ్ కూరబోయిన, గ్లోబల్ జనరల్ సెక్రటరీ  సుమన్ బల్మూరి, ట్రేడ్ అండ్ కామర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడువిజయ్ గరినె, ప్రధాన కార్యదర్శిగా రామ్ ప్రతాప్ శ్రీవాస్తవ్, టీఆర్ఎస్ వీ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్ చార్జిగా డాక్టర్ సిమ్రాల చిన్నలింగమయ్య (అశోక్ యాదవ్), స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి బండారు శ్రీనివాస్ గౌడ్, జూనియర్/పాలిటెక్నిక్/డిగ్రీ/పీజీ ఇన్ చార్జి వల్లకొండ అజయ్ రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ డిజిటల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ కొల్లూరు, ప్రధాన కార్యదర్శి సందీప్ బెల్లంపల్లి, జాయింట్ సెక్రటరీ కొలకాని మనోహర్,జాయింట్ సెక్రటరీ తేజా చౌదరి, జాయింట్ సెక్రటరీ కవిత మేరు, జాయింట్ సెక్రటరీ పాలె నిషా, టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సుహైబ్, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నమనేని బాలాజీ రావు, టీఆర్ఎస్ బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్, టీఆర్ఎస్ జర్నలిస్ట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ మహేందర్ రెడ్డి, తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్ టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు దేవల వీరన్నలను నియమించారు.

Appointment of Telangana Rakshana Sena in-charges for another 18 Assembly constituencies
Appointment of Telangana Rakshana Sena in-charges for another 18 Assembly constituencies

More articles

Latest article