22 C
Hyderabad

ఎమ్మెల్సీలు తాత మధు నవీన్ రెడ్డి ల ను అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrested MLCs Tata Madhu and Naveen Reddy.

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం  ఉదయం హైదరాబాద్‎లోని హైదర్‎గూడ న్యూ ఎమ్మెల్యే  క్వార్టర్స్‎లో పోలీసులు ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‎కు తరలించి విచారిస్తున్నారు. నారాయణగూడ పిఎస్ లో ఇద్దరు ఎమ్మెల్సీ లపై ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఏసీపీ మట్టయ్య తాత  ఇద్దరిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్బంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు స్లోగన్ ఉన్న బ్లాక్ టీ షర్ట్ లు ధరించి అసెంబ్లీ కి రావడన్ని స్పీకర్ ఆదేశాల తో పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్బంగా అసెంబ్లీ గేట్ వద్ద ఎమ్మెల్యే లను పోలీస్ లు అడ్డుకుని అరెస్ట్ చేసే సమయం లో వారి మధ్యలో తోపులాట వాగ్వివాదం జరిగింది. ఈసందర్బంగా ఎమ్మెల్సీ తాత మధు చేసిన వాఖ్యలు వివాదం రేపాయ్. ఈవిషయం లో స్పీకర్ సభలో కంటతాడీ పెట్టుకున్నారు. సభలో ను ఎమ్మెల్సీ మధు పై చర్యలు తీసుకోవాలని సీఎం తో పాటు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోనే ఇద్దరు ఎమ్మెల్సీ లపై కేసులు నమోదు అరెస్ట్ చక చక జరిగిపోయాయి.

Police arrested MLCs Tata Madhu and Naveen Reddy.

More articles

Latest article