28.2 C
Hyderabad

సిజిఆర్ఎఫ్-2 చైర్మన్ గా కిషన్

Kishan appointed as CGRF-2 Chairman

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ:

విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నూతన చైర్మన్ గా కిషన్ నిజామాబాద్ లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన రెండేళ్ల క్రితం సిఈ గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. దీనికి చైర్మన్ గా ఉన్న ఎరుకల నారాయణ పదవి కాలం ఏప్రిల్ లో ముగియడంతో సిఈ రామకృష్ణ కు ఇంచార్జిగా ఇచ్చారు. ఈయన మే నెలలో ఉద్యోగ విరమణ పొందడంతో ఆదిలాబాద్ సిఈ చౌహన్ కు బాధ్యతలు అప్పగించారు.  ఈ పదవి కోసం ఇక్కడే విరమణ చేసిన రామకృష్ణ సైతం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. చివరకు రెండు సంవత్సరాల క్రితం సిఈ గా ఉద్యోగ విరమణ చేసిన కిసాన్ కు మూడేళ్ళ పాటు చైర్మన్ గా నియమిస్తూ  కంపెనీ సిఏండి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. జిల్లా కేంద్రంలో ఉన్న సిజిఆర్ఎఫ్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అకౌంటెంట్ శ్రీనివాస్, ఏడిఈ రాజేశ్వర్, ఏఈ, సిబ్బంది నూతన చైర్మన్ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల్, అదిలాబాద్, మంచిర్యాల్ జిల్లాలకు కలిపి సమస్యల పరిష్కార వేదిక -2 ఈ చైర్మన్ పరిధిలోకి వస్తాయి.

More articles

Latest article