24.3 C
Hyderabad

రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి

The government must pay special attention to the issues faced by rice millers

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గడువులోపు సీఎంఆర్ ను ఎఫ్ సిఐకి అప్పగిస్తాం

. . . కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్

కామారెడ్డి, బతుకమ్మ :

రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. శనివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ధాన్యం మిల్లింగ్, బియ్యం అప్పగింతకు మిల్లర్లకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువుకు అనుగుణంగా బియ్యంను ఎఫ్ సిఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ప్రకటించారు. మిల్లర్లపై పదేపదే ఒత్తిడి తీసుకురావడం వల్ల మిల్లింగ్ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు పరిశీలించకుండా మిల్లర్లందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదన్నారు. రైస్ మిల్లర్లు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మిల్లింగ్‌పై స్పష్టమైన విధానం రూపొందిస్తేనే రైతులు, మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో సెక్రెటరీ సంతోష్, కోశాధికారి సుదర్శన్, కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు భూమేష్ గుప్త మాజీ కార్యదర్శి గౌరీ శంకర్, దోమకొండ బాన్సువాడ నాగరాజు రవీందర్ రాజేష్ రైస్ మిల్ అసోసియేషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article