24.3 C
Hyderabad

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

Illegally transported teak wood seized.

Must read

📰 Generate e-Paper Clip

. . . ముగ్గురిపై కేసు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ పరిధిలోని మల్లారం బీట్ గుండారం చౌరస్తా ప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాను సారం టాస్క్ ఫోర్స్ అదికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న అటవీ టేకు కలప రూ.73,210 ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని నార్త్ ఎఫ్ ఆర్ వో సంజయ్ గౌడ్ తెలిపారు. అక్రమంగా కలప రవాణా చేస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన అబ్రహర్ అలీ ఖాన్, మహమ్మద్ ముక్తార్, సద్దాం షేక్ లపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపడుతూ తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. అటవీ సంపదను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం ,విక్రయించడం చట్టరీత్యా నేరమని అటవీశాఖ అధికారులు తెలిపారు.

More articles

Latest article