24.7 C
Hyderabad

క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్

Konda Surekha dismissed from cabinet

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గవర్నర్ కు సీఎం లేఖ

హైదరాబాద్, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ కు సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించకపోవడం, అదే సమయంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ లకు సురేఖ తనకు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేసిన విషయం తెల్సిందే. ఇటీవల కొండాసురేఖ తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని తెలిసిన వెంటనే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన ప్రయోజనం లేకుండాపోయింది. ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేలా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖను రాజీనామా చేయాలని సూచించిన ఆమె ఖతారు చేయకపోవడంతో బర్తరఫ్ చేసినట్లు తెలిసింది.

Konda Surekha dismissed from cabinet
Konda Surekha dismissed from cabinet

 

 

More articles

Latest article