బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 39,446 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 8 గేట్ల ద్వారా గోదావరిలోకి 24,992 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,000 కుసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
