26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మా ప్రజల త్యాగాలతోనే మల్లన్న సాగర్

Must read

📰 Generate e-Paper Clip

– మా కాలువలు పూర్తి చేసిన తర్వాతే బయటకు నీళ్లు తీసుకెళ్లాలి

-పట్టించుకోకుంటే పంప్ హౌస్ పనులు అడ్డుకుంటాం

-సి ఎస్ ఆర్, డి ఎం ఎఫ్ టీ నిధుల్లో నిర్లక్ష్యంపై సహించేది లేదు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

బతుకమ్మ దుబ్బాక : లక్షలాది మంది ప్రయోజనం కోసం మా ప్రాంత ప్రజలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఎంతో త్యాగం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మా దగ్గర ప్రాజెక్టు ఉంది కానీ మాకు పొలాలకు నీళ్లు రావడం లేవు ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి పిల్ల కాలువలు నిర్మించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. కెసిఆర్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించాం, ఈ సారి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వొస్తే కాలువలు పూర్తి చేసుకునే వాళ్ళమని, ఎమ్మెల్యే గా గెలువగానే నియోజకవర్గం లో పిల్ల కాలువల నిర్మాణం పై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.10 మాసాలు గడిచినా ఉలుకూ పలుకూ లేదు…ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన ఈ ప్రాంతానికి సాగునీళ్లు రావడం లేవని, హైదరాబాద్ కు నీటిని తరలించడానికి పంప్ హౌస్ ల చేపడుతున్నారన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో 10 శాతం కాలువలు మాత్రమే పూర్తి అయ్యాయని, మిగతా 80శాతం వెంటనే పూర్తి చేయాలి…మా కాలువల నిర్మాణం కోసం చర్యలు తీసుకోకుంటే మల్లన్న సాగర్ నుండి ఇతర ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లడానికి నిర్మిస్తున్న పంప్ హౌస్ నిర్మాణాలను రైతులతో కలిసి అడ్డుకుంటాం…ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసిన బడా కాంట్రాక్టర్లు సి ఎస్ ఆర్ నిధులను తమకు కేటాయించడం లేదు, కలెక్టర్ ద్వారా మంజూరు చేసే డి ఎం ఎఫ్ టీ నిధులలో కూడా దుబ్బాక పై వివక్ష చూపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మాయమాటలతో కాలం వెళ్ళాదీయవద్దని రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు రాలే, రైసు మిల్లుల యాజమాన్యం తో మాట్లాడలేదు, గోడాన్ల పరిస్థితి, ధాన్యం రవాణా, నిల్వ పై ముందస్తు ఆలోచన ప్రభుత్వం కు లేదూ వర్షాలు కురుస్తున్న వేల అన్ని ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article