25.7 C
Hyderabad

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరిపై కేసులు నమోదు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పరిధిలోని పలు తండాల్లో విస్తృతంగా గుడుంబా (నాటుసారా) నిరోధక దాడులు నిర్వహించారు. శనివారం మైసమ్మ చెరువు తండా, గబ్బ్యానాయక్ తండా, ఎలుపుగొండ తండా, కంజర్లపల్లి తండా,  నడిమి తండాలలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 30 లీటర్ల బెల్లం పానకాన్ని (బెల్లం ఊట) అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. ​గుడుంబా తయారు చేసినా, అమ్మైనా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది మనోహర్ గౌడ్, రాజు, శరత్, రమాదేవి పాల్గొన్నారు.

 

Excise officials raid illicit liquor dens.

More articles

Latest article