రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. రైస్ మిల్ మిల్లర్ కు ప్రభుత్వం ప్యాడింగ్ ను అలాట్మెంట్ చేయడం జరిగిందన్నారు. 2022-2023 కు సంబంధించిన ప్యాడింగ్ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత డబ్బు మాత్రమే చెల్లించారని మిగతా డబ్బులు చెల్లించకపోవడంతో రైస్ మిల్ కు వచ్చి తనిఖీలు నిర్వహించామన్నారు. రైస్ మిల్ మూసివేసి ఉందని, రైస్ మిల్లర్ కు ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. దింతో పంచనామ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలియజేశారు. సివిల్ సప్లై అధికారులు మహేష్, ఆర్ ఐ భారతి, జిపిఓ స్రవంతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
