24 C
Hyderabad

కోర్టు ధిక్కరణ కేసు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయనను ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల నిధులు విడుదల చేయాలని హైకోర్టు 2024లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయలేదని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో సందీప్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి, ఆయనను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతి విచారణ (వాయిదా)కు సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

Contempt of court case

More articles

Latest article