26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

పోచంపాడు మృతుల కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోచంపాడు ప్రాజెక్టులో నీట మునిగి మృతి చెందిన కలీం, అజీమ్, వజహత్ కుటుంబాలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇర్ఫాన్ అలీ, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, తాహేర్ బిన్ అహ్మదాన్, కేశ వేణు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

TPCC President consoles families of Pochampad victims.

More articles

Latest article