పోచంపాడు మృతుల కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పోచంపాడు ప్రాజెక్టులో నీట మునిగి మృతి చెందిన కలీం, అజీమ్, వజహత్ కుటుంబాలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారికి అన్ని విధాలా...