నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ బెల్లాలా పోతన్న పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పోతన్న భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం పోతన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేష్ కుమార్ గౌడ్, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెల్లాలా పోతన్న సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశ వేణు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొని బెల్లాలా పోతన్నకు నివాళులర్పించారు.

