27.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

తగ్గేలి గ్రామంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారుల తీరుపై గ్రామస్థుల అనుమానాలు

 

. . . ఇసుక అక్రమ వాహనాలు పట్టుకోవాలంటే చీత ఫోర్స్ రావాల్సిందేనా ?

 

సాలూరు, బతుకమ్మ :

 

మంజీర పరివాహక ప్రాంతంలోని తగ్గేలి గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో డోజర్లతో ఇసుకను డంపింగ్ చేసి, అనంతరం బోలెరో, ట్రాక్టర్లు, తిప్పర్ల ద్వారా బోధన్, ఎడపల్లి, జానకం పేట్ మీదుగా జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్నారని వారు చెబుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విధులు కొనసాగుతున్న ప్రాంతాల గుండా ఇసుక వాహనాలు వెళ్తున్నప్పటికీ వాటిని ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇసుక మాఫియా ఇంత బహిరంగంగా అక్రమ రవాణా సాగిస్తోందంటే వారికి కొంతమంది అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి డోజర్ సీజ్ చెయ్యాలని పలువురు కోరుతున్నారు.

More articles

Latest article