26.6 C
Hyderabad
Monday, August 3, 2026

యువతే దేశానికి వెన్నుముక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆలపాటి హరికృష్ణ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

యువత దేశానికి వెన్నుముక అని యవతకు క్రీడాల్లో ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉచితంగా కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ సభ్యులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. సోమవారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో క్రికెట్ కిట్టును ట్రస్ట్ సభ్యులు యూత్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లలో గడుపుతు క్రీడాలకు దూరంవుతున్నారని తద్వారా మానసిక, శారీరకంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే పట్టుదల తో ఏదైనా సాధించవచ్చునని అయన అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆలపాటి హరికృష్ణ ను అక్బర్ నగర్ యూత్ సభ్యులు మొహమ్మద్ లోఖ్మాన్ రఫీ శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో థామస్, మద్దిరెడ్డి రాజేష్,పత్తి సతీష్, షేక్ ఈసా, మొహమ్మద్ అల్తాఫ్, మొహమ్మద్ ఇర్ఫాన్, అసిఫ్, లోఖ్మాన్ రఫీ, ఆఫ్జాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article