31 C
Hyderabad

ఘనంగా ఊర పండుగ ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోతరాజుల విన్యాసాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగ అమ్మవార్ల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అమ్మవార్ల ఉత్సవ ఊరేగింపులో సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో సందడి చేశారు. ఉత్సవాల్లో పోతరాజుల సాంప్రదాయ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ పోతరాజులతో కలిసి ఊరేగింపులో పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, సీనియర్ నాయకులు ఎండల సుధాకర్, రాగి నారాయణ యాదవ్, పటేల్ ప్రసాద్, వడ్ల రవికుమార్, భారతి శ్రీనివాస్, నరేందర్, విజయ్ కుమార్, మల్లేష్ గౌడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, సంప్రదాయ వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలతో ఇందూరు నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

 

Village festival celebrations held on a grand scale

More articles

Latest article